ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ మనవడు హిమాన్షు
- వ్యాయామం చేస్తుండగా గాయపడ్డ హిమాన్షు
- గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
- ఆసుపత్రిలో హిమాన్షును పరామర్శించిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల హిమాన్షు వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆయన ముక్కుకు స్వల్ప గాయమైంది. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన విషయం తెలియగానే హరీశ్ రావు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆసుపత్రికి చేరుకుని హిమాన్షును పరామర్శించి, వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం హిమాన్షు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.