సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
- సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు
- డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
- సింగరేణి ఆస్తులు తగులబెట్టాలంటూ బాల్క సుమన్ మాట్లాడిన వీడియో వైరల్
బాల్క సుమన్ ఏమన్నారు?
బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరసనలు తెలిపేందుకు రైతులు, కార్మికులు రావడం లేదని వ్యాఖ్యానించారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులే మిలిటెంట్ తరహా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే రోడ్లపై గొడవలు చేయాలని, సింగరేణి కార్యాలయాన్ని, ఆస్తులను ధ్వంసం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆయన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పలువురు మండిపడ్డారు. సీంగరేణి జీఎం కార్యాలయం, సింగరేణి భవన్ తగులబెట్టాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారని, ఇది సరికాదని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.