సీఎంగా విజయ్ ప్రమాణం.. నీలిరంగు పట్టుచీరలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష.. వీడియో ఇదిగో!
- విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన నటి త్రిష
- నీలిరంగు పట్టుచీర, మల్లెపూలతో సంప్రదాయ వస్త్రధారణ
- ఎన్నికల ఫలితాల నుంచి విజయ్‌కు త్రిష బహిరంగంగా మద్దతు
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న ద్రవిడ దిగ్గజాలైన డీఎంకే, అన్నాడీఎంకేలను ఓడించి విజయ్ చరిత్రాత్మక విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాల రోజు నుంచి త్రిష తన మిత్రుడు విజయ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఫలితాల రోజు (మే 4న) తన పుట్టినరోజున తిరుపతిలో ప్రత్యేక పూజలు చేశారు. విజయ్ పార్టీ ఆధిక్యం ఖరారయ్యాక చెన్నైలోని ఆయన నివాసానికి కూడా వెళ్లారు. అంతకుముందు, పోలింగ్ రోజున 'గిల్లి' సినిమా నేపథ్య సంగీతంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి పరోక్షంగా తన మద్దతు తెలిపారు.
మరోవైపు, విజయ్ భార్య సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, విజయ్-త్రిష సంబంధంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలపై ఇద్దరూ మౌనం పాటిస్తున్నప్పటికీ, పలు సందర్భాల్లో కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.