విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యమవుతోందని.. నిప్పంటించుకున్న టీవీకే కార్యకర్త
- విజయ్‌ను సీఎంగా చూడలేకపోతున్నానని మనస్తాపం
- తిరునల్వేలిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 40 ఏళ్ల వ్యక్తి
- వీడిన ఉత్కంఠ.. నేడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. అయితే, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్‌కు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉందని భావించిన విజయ్ గత మూడు రోజుల్లో మూడు సార్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. అయితే, మెజారిటీకి అవసరమైన సంఖ్య ఇంకా లేదని స్పష్టం చేసిన గవర్నర్, ఆయనను వెనక్కి పంపారు. దీంతో విజయ్ ముఖ్యమంత్రి కాలేకపోతున్నారన్న మనస్తాపంతో ఇసక్కియప్పన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కాగా, ఎట్టకేలకు విజయ్‌కు అవసరమైన మద్దతు లభించింది. కాంగ్రెస్‌తోపాటు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు పలకడంతో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైంది. ఈ ఉదయం 10 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.