ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన విజయ్
- ఫలితాల తర్వాత ఎక్స్ వేదికగా తొలిసారి విజయ్ స్పందన
- ప్రజాశ్రేయస్సే తమ ఏకైక లక్ష్యమన్న విజయ్
- ఈ కృషిలో కేంద్రం సహకారం కావాలని ప్రధానికి విజ్ఞప్తి
ఫలితాల తర్వాత ఆయన 'ఎక్స్' వేదికగా తొలిసారి స్పందిస్తూ, ప్రజా శ్రేయస్సే తమ ఏకైక లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రగతి, తమిళనాడు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ కృషిలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు.
తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన రాహుల్ గాంధీకి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించేందుకు సమష్టి సహకారం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తామని విజయ్ అన్నారు.