ఓటీటీ తెరపైకి ప్రదీప్ రంగనాథన్ మూవీ!
- ప్రదీప్ రంగనాథన్ నుంచి 'ఎల్ ఐ కె'
- 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా
- 60 కోట్ల దగ్గరే ఆగిపోయిన వసూళ్లు
- ఈ నెల 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో
గతంలో ప్రదీప్ చేసిన సినిమాలన్నీ చాలా తేలికగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. దాంతో ఈ సినిమా కూడా ఒక రేంజ్ లో వసూళ్లను కొల్లగొడుతుందని భావించారు. ఆ నమ్మకంతోనే 100 కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. అయితే ఈ సినిమా 60 కోట్ల దగ్గరే తన జోరును తగ్గించింది. 100 కోట్ల మార్క్ ను టచ్ చేయలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 6వ తేదీ నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన 'అమెజాన్ ప్రైమ్' నుంచి వచ్చేసింది.
ఇది లవ్ స్టోరీనే .. కాకపోతే ఇప్పటి కాలానికి చెందిన ప్రేమకథ కాదు. 2040లో ప్రేమలు ఎలా ఉండబోతున్నాయి? అనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అప్పటి యూత్ ధోరణి ఎలా ఉంటుంది? వాళ్ల ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అనేవి వినోదభరితంగా చూపించే ప్రయత్నం చేశారు. సైంటిఫిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి.