పాకిస్థాన్లో దొంగల హల్చల్... జాతీయ రహదారుల్లోని సీసీటీవీ కెమెరాల చోరీ
- సుక్కూర్-ముల్తాన్ జాతీయ రహదారిపై 200 కిలోమీటర్ల మేర దొంగల బీభత్సం
- నిఘా కెమెరాలు, స్పీడ్ కెమెరాలు, సోలార్ ప్యానళ్లు, లైట్ల చోరీ
- కెమెరాల చోరీతో ఇబ్బందికరంగా మారుతున్న భద్రత పర్యవేక్షణ
ఈ ప్రాంతంలోని దొంగలు నిఘా కెమెరాలు, స్పీడ్ కెమెరాలు, సోలార్ ప్యానళ్లు, లైట్లు, ఇతర ఉపకరణాలు, స్థంభాలను దొంగిలిస్తున్నారని ఒక అధికారి తెలిపారు. దొంగలు సోలార్ రిఫ్లెక్టర్లను ధ్వంసం చేశారని, వీధి దీపాలను ఆర్పివేసి తమ కార్యకలాపాలను సాగిస్తున్నారని వెల్లడించారు. నిఘా, స్పీడ్ కెమెరాలను మాయం చేయడంతో ఈ జాతీయ రహదారిపై భద్రతను పర్యవేక్షించడానికి, వేగ పరిమితులను అమలు చేయడానికి ఆటంకంగా మారుతోందని చెప్పారు.