'బైకర్' సెన్సార్ టాక్.. రిపోర్ట్ ఏం చెబుతోందంటే..?
- రేపే థియేటర్లలోకి శర్వానంద్ 'బైకర్'
- సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్
- శర్వా, రాజశేఖర్ నటన, రేసింగ్ సీన్స్ హైలైట్
- తండ్రీ కొడుకుల ఎమోషన్స్ కంటతడి పెట్టిస్తాయన్న రిపోర్ట్
భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి మోటోక్రాస్ రేసింగ్ చిత్రంగా 'బైకర్' ప్రచారంలో ఉంది. సెన్సార్ టాక్ ప్రకారం ప్రథమార్ధం ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రారంభమవుతుంది. ప్రతి ఫ్రేమ్‌లో శర్వానంద్ నటన ఆకట్టుకుంటుందని, చాలా కాలం తర్వాత డా. రాజశేఖర్ ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలో కనిపించారని తెలుస్తోంది. రియల్ రేస్ ట్రాక్‌లపై చిత్రీకరించిన విజువల్స్, ముఖ్యంగా క్లిఫ్ జంప్ సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తుందని సమాచారం.
ఇక, ద్వితీయార్ధం మొత్తం తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగాలపై నడుస్తుందని తెలుస్తోంది. శర్వానంద్, రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా పతాకస్థాయికి తీసుకెళ్తాయని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే రేసింగ్ సీన్ మునుపెన్నడూ చూడని విధంగా గూస్బంప్స్ తెప్పిస్తుందని రిపోర్ట్ పేర్కొంటోంది.
నటీనటుల అద్భుతమైన నటనతో పాటు టాప్ క్లాస్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని సెన్సార్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద స్పోర్ట్స్ డ్రామా జానర్‌కు కావాల్సిన అన్ని అంశాలు అత్యుత్తమ నాణ్యతతో ఉన్నాయని తెలుస్తోంది. ఈ పాజిటివ్ టాక్‌తో శర్వానంద్ ఖాతాలో కచ్చితంగా ఓ బ్లాక్‌బస్టర్ పడినట్లేనని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాత్రి జరగనున్న ప్రీమియర్ షోల తర్వాత సినిమాపై పూర్తి స్పష్టత రానుంది.