క్షిపణిపై "భారత ప్రజలకు కృతజ్ఞతలు" అంటూ రాసి ఇజ్రాయెల్ పై ప్రయోగించిన ఇరాన్
- ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఖండిస్తూ ఇరాన్‌కు సంఘీభావం తెలిపిన దేశాలకు టెహ్రాన్ కృతజ్ఞతలు
- భారత్‌తో పాటు జర్మనీ, పాకిస్థాన్, స్పెయిన్ దేశాలకు ధన్యవాదాలు తెలిపిన ఇరాన్
- సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ముంబైలోని ఇరాన్ కాన్సులేట్
ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియా హ్యాండిల్ తన 'ఎక్స్' ప్లాట్‌ఫామ్‌పై ఈ పోస్టును పంచుకుంది. అందులో "అమెరికా మరియు ఇజ్రాయెల్‌పై 83వ విడత క్షిపణి దాడులతో ప్రతిస్పందిస్తున్నాం. ఇలాంటి సమయంలో తమ మద్దతు, సంఘీభావం తెలిపినందుకు స్పెయిన్, పాకిస్థాన్, భారతదేశం, జర్మనీ ప్రజలకు ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్ తరపున కృతజ్ఞతలు" అని పేర్కొంది.