ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు
- మర్యాదపూర్వకంగా సభాపతిని కలిసిన తెలంగాణ మంత్రులు
- మార్చి 5న జరగనున్న కుమారుడి వివాహానికి ఆహ్వానించిన భట్టివిక్రమార్క
- అంతకుముందు, కనకదుర్గమ్మను దర్శించుకున్న భట్టివిక్రమార్క
అంతకుముందు, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉదయం మల్లు భట్టివిక్రమార్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం భట్టివిక్రమార్కకు పండితులు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.