తిరుమల అప్‌డేట్: 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు.. భారీగా హుండీ ఆదాయం
- తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ
- సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం
- 25 క్యూ కంపార్ట్‌మెంట్లలో వేచిచూస్తున్న భక్తులు
- ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 76,506 మంది భక్తులు
టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం మొత్తం 76,506 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,049 మంది తలనీలాలు సమర్పించుకోగా, హుండీ ద్వారా రికార్డు స్థాయిలో రూ. 4.20 కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు రోజు (శనివారం) 82,043 మంది భక్తులు దర్శనం చేసుకోగా, రూ. 3.74 కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. శనివారంతో పోలిస్తే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గినా, హుండీ ఆదాయం పెరగడం గమనార్హం.