ఎప్ స్టీన్ ఫైల్స్ పై దలైలామా వివరణ ఇదిగో!
- ఇటీవల విడుదలైన ఫైల్స్ లో 169 చోట్ల దలైలామా ప్రస్తావన
- జెఫ్రీ ఎప్ స్టీన్ ను తాను ఎన్నడూ కలవలేదన్న దలైలామా
- ఎక్స్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేసిన బౌద్ధ మతగురువు
ఎప్ స్టీన్ ఫైల్స్ లో తన పేరు ప్రస్తావన, తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఎప్ స్టీన్ తో కానీ ఆయన ప్రతినిధులతో కానీ తాను ఎన్నడూ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో జెఫ్రీ ఎఫ్ స్టీన్ తో దలైలామా సమావేశమైనట్లు చూపించడంపై దలైలామా ఆఫీసు అభ్యంతరం వ్యక్తం చేసింది. దలైలామాపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించింది.