ఏపీలో వేగవంతంగా ఫింఛన్ల పంపిణీ ..10.30 గంటల సమయానికే 60 శాతం పంపిణీ
- ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
- లబ్దిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది
- గుడిపల్లి మండలం బెగ్గిలపల్లె లో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం బెగ్గిలపల్లె లో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్దిదారులకు నేరుగా పింఛన్లు అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 62,94,844 పింఛన్ లబ్దిదారులకు గానూ ఉదయం 10.30 గంటల సమయానికి 38,18,798 (60.67శాతం) మందికి పంపిణీ జరిగింది.