విశాఖలో చంద్రబాబు కుటుంబం భూదోపిడీకి తెరలేపింది: బొత్స సత్యనారాయణ
- జీవీఎంసీ ధర్నాచౌక్ వద్ద వైసీపీ నిరసనలు
- గీతం యూనివర్శిటీ భూదోపిడీని అరికట్టాలని నినాదాలు
- ప్రజల ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమన్న బొత్స
ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ... చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖలో భూదోపిడీకి తెరలేపిందని అన్నారు. అధికారం ఉందని భూదోపిడీ చేస్తే పేద కుటుంబాల తరపున తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అన్నారు. ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.