భారత్ పై తగ్గనున్న ట్రంప్ టారిఫ్ లు..!
- భారత్ పై 50 శాతం సుంకాలు వసూలు చేస్తున్న అమెరికా
- ఇటీవల రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించిన భారత్
- 25 శాతం టారిఫ్ లు తగ్గించనున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి హింట్
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తుసేవలపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. అయితే, ఇటీవల రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించింది. దీంతో అమెరికా సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.