యూపీలో 'ఎస్ఐఆర్'.. వివిధ కారణాలతో 2.8 కోట్ల ఓట్ల తొలగింపు
- 15.44 కోట్ల నుంచి ఎస్ఐఆర్ తర్వాత 12.56 కోట్లకు తగ్గిన ఓటర్లు
- శాశ్వత వలస, మరణాలు, ఒకటి కంటే ఎక్కువ చోట రిజిస్ట్రేషన్ల ఓటర్ల తొలగింత
- అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా సమర్పించవచ్చన్న అధికారులు
తొలగించిన 2.89 కోట్ల మందిలో 46 లక్షల మంది మరణించారని, 2.17 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారని, 25.47 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువచోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు.
ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు ఉత్తరప్రదేశ్లో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వివిధ కారణాల వల్ల ఓటర్ల తొలగింపుల అనంతరం ఆ సంఖ్య 12.56 కోట్లకు తగ్గింది. ఓటర్లు తమ పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో యాప్ ద్వారా లేదా ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాల్లో అభ్యంతరాలను స్వీకరిస్తామని, వాటిని పరిష్కరించిన తర్వాత తుది జాబితాను మార్చి 6న విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.