ఇది కోర్టుల్లో తేలేది కాదు: సీపీఐ నారాయణ
- నదీ జలాల వివాదాలు కోర్టుల్లో తేలే అంశాలు కావాన్న సీపీఐ నారాయణ
- రాజకీయంగా పైచేయి కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు బహిరంగ ప్రకటనలకు దిగకూడదని సూచన
- నాలుగు గోడల మధ్య కూర్చొని చర్చల ద్వారా పరిష్కారం కోసం నిర్ణయం తీసుకోవాలని సూచన
ఈ అంశంలో రాజకీయంగా పైచేయి కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగ ప్రకటనలకు దిగకూడదని ఆయన సూచించారు. పరస్పర సమన్వయంతో, నాలుగు గోడల మధ్య కూర్చొని చర్చల ద్వారా పరిష్కారం కోసం నిర్ణయం తీసుకోవాలన్నారు.
అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకుని, ఒక స్పష్టమైన స్వరూపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుపడేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన హితవు పలికారు.