మళ్లీ వస్తున్న అబ్బాస్... 'హ్యాపీ రాజ్' ప్రోమో ఇదిగో!
- 'హ్యాపీ రాజ్' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న నటుడు అబ్బాస్
- జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమా
- విడుదలైన చిత్ర అధికారిక ప్రచార చిత్రం
- కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌లో స్థిరపడిన ప్రేమదేశం హీరో
- ఈ చిత్రంతో అబ్బాస్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం
దక్షిణాది భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన అబ్బాస్, కెరీర్ మంచి దశలో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'హ్యాపీ రాజ్' సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా, గీతా కైలాసం, జార్జ్ మరియన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
మరియా రాజా ఎలాంచెళియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జైవర్ధ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత అబ్బాస్‌ను మళ్లీ తెరపై చూసేందుకు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.