సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉపసర్పంచ్ అయ్యాడు
- సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆసక్తికరం
- సర్పంచ్‌గా పోటీ చేయాలని భావించినప్పటికీ అనుకూలించని రిజర్వేషన్ అంశం
- వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఉపసర్పంచ్ అయిన ప్రవీణ్ కుమార్
అతని తల్లిదండ్రులు గత 18 సంవత్సరాలుగా గ్రామంలో వివిధ పదవుల్లో కొనసాగారు. వారి అడుగుజాడల్లో నడవాలని భావించిన ప్రవీణ్ కుమార్, తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వార్డు మెంబర్‌గా పోటీ చేశాడు. వాస్తవానికి అతను సర్పంచ్‌గా పోటీ చేయాలని అనుకున్నాడు. కానీ రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో తన అనుచరుడిని సర్పంచ్‌గా గెలిపించాడు. ప్రవీణ్ వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్ పదవిని సొంతం చేసుకున్నాడు.