కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాల వేళ ఆసక్తికర పరిణామం.. డీకేఎస్ డిన్నర్ మీట్
- 30 మంది ఎమ్మెల్యేలతో డిన్నర్ చేసిన ఉప ముఖ్యమంత్రి
- కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్‌హౌస్ లో గురువారం రాత్రి సమావేశం
- పలువురు మంత్రులు కూడా పాల్గొన్నట్లు సమాచారం
ముఖ్యమంత్రి పదవి మార్పునకు సంబంధించి హైకమాండ్ సూచనల మేరకు ఇటీవల సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో భేటీ అయి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో పార్టీ పనితీరు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంపై చర్చించుకున్నట్లు ఇరువురు నేతలు మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో విందు రాజకీయాలు సంచలనంగా మారాయి. అయితే, ఇవన్నీ సాధారణ కార్యక్రమాలేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ‘‘ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నాం. అదొక స్నేహపూర్వక సమావేశం’’ అని డీకే చెప్పారు.