ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్!
- జులైలో థియేటర్లకు వచ్చిన 'ది 100'
- మరోసారి పోలీస్ పాత్రలో కనిపించిన సాగర్
- ఆయన నటన హైలైట్
- ప్రధానమైన బలంగా నిలిచిన ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం
- టాప్ టెన్ లో నిలిచిన కంటెంట్
మెగా మదర్ మొదలు పవన్ .. నాగబాబు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో, అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షించింది. జులై 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. విలువలతో కూడిన సినిమాలను నిర్మించడంలో ఉత్సాహాన్ని చూపుతున్న రమేశ్ కరుటూరి .. వెంకీ పూషడపు .. తారక్ రామ్ ఈ సినిమాను నిర్మించారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కథాకథనాల పరంగా, సాగర్ యాక్షన్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం ఈ కథకు బలమైన సపోర్టుగా నిలిచాయి. ఈ నెల 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ - లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా, చాలా వేగంగా టాప్ టెన్ లో నిలిచింది.
ఐపీఎస్ గా శిక్షణ పూర్తిచేసుకున్న విక్రాంత్, సిటీలో ఛార్జ్ తీసుకుంటాడు. ఒక ముఠాకి సంబంధించిన కేస్ అతనికి సవాలు విసురుతుంది. తాను ఇష్టపడిన 'ఆర్తి' కూడా ఆ ముఠా బారిన పడిందని తెలియడంతో అతను మరింత దూకుడుగా ముందుకు వెళతాడు. అయితే ఆ కేసుకి .. ఆ ముఠాకి సంబంధం లేదని తెలిసి ఆలోచనలో పడతాడు. అసలు నేరస్థులు ఎవరు? వాళ్లు ఆర్తిని ఎందుకు టార్గెట్ చేశారు? ఆ కేసును విక్రాంత్ ఎలా ఛేదిస్తాడు? అనేది కథ. మిషా నారంగ్ .. ధన్య బాలకృష్ణ .. కల్యాణి నటరాజన్ .. తారక్ పొన్నప్ప కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అనిపిస్తోంది.