ట్రామ్ లో సామాన్యుడిలా ప్రయాణించిన దుబాయ్ పాలకుడు.. వీడియో ఇదిగో!
అయితే, ఈ ప్రయాణంలో రాజు కానీ, ఆయన భద్రతా సిబ్బంది కానీ ఎలాంటి హడావుడి చేయకపోవడం విశేషం. మిగతా ప్రయాణికులలానే వారంతా ట్రామ్ కోసం స్టేషన్ లో వేచి ఉండడం, ట్రామ్ రాగానే మిగతా వారితో పాటు లోపలికి వెళ్లి ఓ ఖాళీ సీటులో కూర్చోవడం వీడియోలో కనిపించింది. దేశాన్ని పాలించే రాజు తమతో కలిసి ట్రామ్ లో ఎక్కడం చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు.