చంద్రబాబును కలిసిన అక్కినేని నాగార్జున.. ఫొటోలు ఇవిగో
- ఈ నెల 6న అక్కినేని అఖిల్ వివాహం
- చంద్రబాబుకు వివాహ ఆహ్వాన పత్రికను అందించిన నాగార్జున
- ఇరువురి మధ్య కాసేపు పలు అంశాలపై చర్చ
ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. అఖిల్ వివాహం ఈ నెల 6వ తేదీన జరగనున్న నేపథ్యంలో, నాగార్జున ప్రముఖులను స్వయంగా కలిసి వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు ఉండవల్లికి విచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇరువురు కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం.

