జూన్ 6న అక్కినేని అఖిల్ పెళ్లి?
- జైనబ్ రవ్‌డ్జీతో అఖిల్ పెళ్లి
- పెళ్లి సందడి అప్పుడే మొదలైనట్టు వార్తలు
- గత ఏడాది నవంబర్ 26న జరిగిన అఖిల్, రవ్డ్జీ నిశ్చితార్థం
గత కొంతకాలంగా అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. నిశ్చితార్థం అనంతరం ఈ జంట పలుమార్లు కలిసి విహారయాత్రలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వీరి వివాహ తేదీ ఖరారైందని, జూన్ 6న అఖిల్, జైనబ్ ఏడడుగులు వేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వినికిడి.