సన్ రైజర్స్ టాస్ గెలిచింది.. కానీ...!
- ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ × సీఎస్కే
- చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్
టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి దెబ్బతిన్న అనుభవంతో ఇవాళ బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
ఈ మ్యాచ్ కోసం మహ్మద్ షమీ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అటు, సీఎస్కే జట్టులో రెండు మార్పులు జరిగాయని కెప్టెన్ ధోనీ వెల్లడించాడు. రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్ స్థానంలో డివాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా జట్టులోకి వచ్చారని తెలిపాడు.