పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
- సింగపూర్ లోని ఓ స్కూల్లో అగ్నిప్రమాదం
- పవన్ కుమారుడు మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు
- ఊపిరితిత్తుల్లోకి పొగ
- ఆసుపత్రిలో చికిత్స
- ఈ ప్రమాదం ఎంతో కలచివేసిందన్న రోజా
"ఈ రోజు పవన్ కల్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు కలిగి ఆరోగ్యవంతుడై కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుడ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం సింగపూర్ వెళ్లనున్నారు.