భారత్ గెలుపు.. విరుష్క జోడీ రియాక్షన్ వీడియో వైరల్!
- తొలి సెమీఫైనల్లో ఆసీస్‌పై భారత్ అద్భుత విజయం
- సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన కేఎల్ రాహుల్
- డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా ఆటగాళ్ల సంబరాలు
- స్టాండ్‌లో కూర్చున్న భార్య అనుష్కను చూస్తూ గెలిచేశామంటూ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్
- చప్పట్లతోనే కోహ్లీని అభినందించిన అనుష్క
- ప్రస్తుతం విరుష్క జోడీ రియాక్షన్ వీడియో నెట్టింట వైరల్
ఇదిలాఉంటే.. చివర్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు, సిబ్బంది సంబరాల్లో మునిగిపోయారు. ఇక విరాట్ కోహ్లీ ఆనందానికైతే హద్దుల్లేవు. కెప్టెన్ రోహిత్‌ను గట్టిగా కౌగిలించుకుని, మైదానంలోకి పరిగెత్తాడు. బౌండరీ లైన్ వద్ద నిలబడి, స్టాండ్‌లో కూర్చున్న తన భార్య అనుష్క శర్మను చూస్తూ గెలిచేశాం అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అనుష్క కూడా చప్పట్లతోనే కోహ్లీని అభినందించింది. ప్రస్తుతం విరుష్క జోడీ రియాక్షన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.