రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసు.. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు నోటీసులు
- దర్యాప్తులో మరో అడుగు ముందుకు
- అప్పట్లో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్
- రఘురామ కేసులో ఆయన పాత్రపైనా అనుమానం
- బీహార్‌లో ఉన్న సునీల్ నాయక్‌కు వాట్సాప్, ఫ్యాక్స్ ద్వారా నోటీసులు
బీహార్ క్యాడర్‌కు చెందిన సునీల్ నాయక్‌ను వైసీపీ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి సీఐడీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే సునీల్ నాయక్ తిరిగి బీహార్ వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడాయన అగ్నిమాపకశాఖ విభాగంలో డీఐజీగా పనిచేస్తున్నారు.