'గేమ్ ఛేంజర్' సినిమా అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపుపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం
- సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదని రేవంత్ అన్నారన్న హరీశ్
- అసెంబ్లీలో చెప్పిన మాటలకు కూడా విలువ లేకపోతే ఎలాగని ప్రశ్న
- రేవంత్, కోమటిరెడ్డిలపై ప్రివిలేజ్ మోషన్ పెడతామన్న హరీశ్
అసెంబ్లీలో చెప్పిన మాటలకు కూడా విలువ లేకపోతే ఎలాగని హరీశ్ ప్రశ్నించారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించడం సభను అవమానించడమే అవుతుందని... రేవంత్, కోమటిరెడ్డిలపై ప్రివిలేజ్ మోషన్ పెడతామని అన్నారు. మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పి... ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగారు. ఒక మహిళ మృతి చెందిన దురదృష్టకర ఘనటను మరువక ముందే యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.