అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసుల నోటీసులు
- రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు
- ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న అల్లు అర్జున్
ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కూడా పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.