అశ్విన్ సంతోషంగా లేడు.. ముఖంలో ఆవేదన కనిపించింది: కపిల్ దేవ్
- అశ్విన్ ఇలా ఆటను వదిలేయడం షాక్ కు గురి చేసిందన్న కపిల్
- అశ్విన్ కు బీసీసీఐ ఘనమైన వీడ్కోలు పలకాలని సూచన
- అశ్విన్ ఒక ఛాంపియన్ అని కితాబు
అశ్విన్ కు తగిన గౌరవం ఇవ్వాలని కపిల్ అన్నారు. టీమిండియా మ్యాచ్ విన్నర్ అశ్విన్ కు బీసీసీఐ ఘనమైన వీడ్కోలు పలకాలని చెప్పారు. ప్రయోగాలకు అశ్విన్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడని... అదే ఆయనను గొప్ప క్రికెటర్ గా నిలబెట్టిందని కొనియాడారు. అశ్విన్ ఒక ఛాంపియన్ అని కితాబునిచ్చారు. కెప్టెన్ నమ్మే బౌలర్ అశ్విన్ అని చెప్పారు.