మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు?: తొక్కిసలాట ఘటనపై సంధ్య థియేటర్‌కు నోటీసులు
- పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసుల నోటీసులు
- పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట... మహిళ మృతి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతురాలి తనయుడు
ఈ నెల 4వ తేదీన రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. తాజాగా, సంధ్య థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.