ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న
- చేనేత సమస్యలపై మాట్లాడిన లోకం మాధవి
- మీరు కట్టుకున్నది చేనేత చీరేనా అని ప్రశ్నించిన రఘురాజు
- నవ్వుతూ సమాధానమిచ్చిన మాధవి
ఈ క్రమంలో చేనేత సమస్యలపై జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ... చేనేత కార్మికుల సమస్యలను లేవనెత్తారు. అనంతరం రఘురాజు మాట్లాడుతూ లోకం మాధవి మాట్లాడిన తీరును అభినందించారు. చేనేత సమస్యలను చక్కగా వివరించారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించగా... ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి.