వైజాగ్ యాసలో అభిమానిని ఆటపట్టించిన చిరంజీవి.. ఇదిగో వీడియో!
- జీబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి
- చిరు మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర ఘటన
- బాసూ నిన్ను చూడాలని వైజాగ్ నుంచి వచ్చానన్న అభిమాని
- ఉత్తరాంధ్ర యాసలో సమాధానం ఇచ్చి నవ్వులు పూయించిన చిరు
అది విన్న మెగాస్టార్.. ఆ అభిమానిని వైజాగ్ యాసలోనే ఆటపట్టించారు. "అయితే ఏటంటావ్ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే.. మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి. భలేవాడివే..మన హీరోది కూడా అదే ఊరు" అంటూ చిరు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడడంతో వేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది. అక్కడున్నవారంతా చిరంజీవి టైమింగ్‌కి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. దీని తాలూకు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.