ఇదేం ఇసుక పాలసీ?: ఎమ్మెల్సీ బొత్స
- కూటమి ప్రభుత్వం ఇసుక విధానంపై బొత్స విమర్శలు
- ఇసుక పాలసీలో స్పష్టత లేదని వ్యాఖ్యలు
- కూటమి పార్టీ నేతలు యధేచ్ఛగా ఇసుక దోచుకుంటున్నారని ఆరోపణ
ఓవైపు ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకుంటూనే, మరోవైపు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పార్టీల నేతలు మాత్రం ఇసుకను యధేచ్ఛగా దోచుకుంటున్నారని బొత్స ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 117 రోజులు గడుస్తున్నా, భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవని, ఇసుకపై ఆధారపడిన వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.