ఆ సినిమాతో మా ఆస్తులన్నీ పోయాయి: ఐశ్వర్య రాజేశ్ తల్లి నాగమణి
- హీరో కావడానికి రాజేశ్ కష్టపడలేదన్న నాగమణి
- 'అలజడి' సినిమా నష్టాలు తెచ్చిందని వెల్లడి
- ఆ బాధనుంచి ఆయన కోలుకోలేదని వ్యాఖ్య
- నటిగా మారాలని ఐశ్వర్య అనుకోలేదని వివరణ
రాజేశ్ కి స్నేహితులు ఎక్కువ .. ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేసేవారు. అలా ఆయన 'అలజడి' అనే సినిమాకి ఒక నిర్మాతగా ఉన్నారు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వలన .. మరో నిర్మాత మాట తప్పడం వలన నష్టాలు వచ్చాయి. అప్పటివరకూ ఆయన కష్టపడి సంపాదించినది మొత్తం ఆ సినిమాతో పోయింది. ఆ బాధ నుంచి తట్టుకోవడం ఆయనకి చాలా కష్టమైంది. ఆ తరువాత పచ్చకామెర్లు రావడంతో ఆయన మరణించారు" అని అన్నారు.
"తండ్రి చనిపోయే సమయానికి ఐశ్వర్య రాజేశ్ కి ఎనిమిదేళ్లు. ఆమె ఎప్పుడూ సినిమాల గురించిన ఆలోచన చేయలేదు. బాగా చదువుకుని ఉద్యోగం చేయాలని అనుకునేది. కానీ అనుకోకుండానే వచ్చిన అవకాశాలు ఆమెను మంచి పొజీషన్ లోకి తీసుకుని వెళ్లాయి. ఎక్కువగా మేకప్ చేయకపోవడం.. సహజంగా నటించడం ఆమెకి ప్లస్ అయ్యాయని నేను నమ్ముతాను" అని అన్నారు.