ప్రేక్షకుల మధ్య ఉన్న చిన్ననాటి గురువును గుర్తుపట్టి... వెళ్లి పాదాభివందనం చేసిన రాజస్థాన్ సీఎం
- ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జైపూర్లో సన్మాన కార్యక్రమం
- ప్రేక్షకుల మధ్య ఉన్న తన టీచర్ను గుర్తించిన సీఎం భజన్ లాల్ శర్మ
- స్టేజ్ దిగి వెళ్లి గురువు కాళ్లకు నమస్కరించిన ముఖ్యమంత్రి
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మట్టిని పిసికి అందమైన విగ్రహాన్ని తయారు చేసే కుమ్మరుల వంటివారే ఉపాధ్యాయులు అన్నారు. వారి అంకితభావానికి వెలకట్టలేమని తెలిపారు. విద్యార్థుల విజయానికి అహర్నిశలు కృషి చేస్తారని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సీఎం తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఆ రోజుల్లో పాఠశాలలో పిల్లవాడిని చేర్పించిన రోజును ఎంతో శుభదినంగా భావించేవారని, స్కూల్లో చేర్పించాక బెల్లం పంచేవారని గుర్తు చేసుకున్నారు.
తాను స్కూల్ లో చేరిన సమయంలో శంకర్ లాల్ ఒక్కరే ఉపాధ్యాయుడుగా ఉన్నారని, తనకు ఐదో తరగతి వరకు ఆయన చదువు చెప్పాడన్నారు.