చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్
- ముగిసిన పవన్ వారాహి దీక్ష
- రెండు దశాబ్దాలుగా చాతుర్మాస దీక్షను చేపడుతున్న పవన్
- నాలుగు నెలల పాటు కొనసాగనున్న చాతుర్మాస దీక్ష
మరోవైపు... త్వరలోనే పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టబోతున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఆయన ఈ దీక్షను చేపడుతున్నారు. ఈ దీక్ష ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాలు కలిపి... నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. గృహస్తాచార రీతిలో ఈ దీక్షను పవన్ చేపట్టనున్నారు. అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటూనే... శుభ తిథుల సమయంలో దీక్షా వస్త్రాలను ఆయన ధరిస్తారు.