కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చేతికి కట్టుతో ఐశ్వర్య రాయ్ క్యాట్‌వాక్.. ఏమైందంటూ ఆరా తీస్తున్న నెటిజన్లు!
- 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కుమన్న మాజీ ప్రపంచ సుందరి
- ఫాల్గుణి అండ్ షేన్ పీకాక్ డిజైనర్లు రూపొందించిన బ్లాక్ అండ్ వైట్ కలర్ గౌన్‌లో మెరిసిన ఐశ్వర్య
- కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య క్యాట్వాక్లో పాల్గొనడం ఇది 21వసారి
- 2002లో దేవదాస్ మూవీ ప్రీమియర్ సందర్భంగా తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఐష్
50 ఏళ్ల వయసులోనూ బిగ్ బి కోడలు అంతే గ్లామర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. కాగా, ఆమె గత రెండు దశాబ్దాల నుంచి కేన్స్ ఫెస్టివల్లో పాల్గొంటుండడం విశేషం. కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య క్యాట్వాక్లో పాల్గొనడం ఇది 21వ సారి. 2002లో 'దేవదాస్' మూవీ ప్రీమియర్ సందర్భంగా ఆమె తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు.
ఇదిలాఉంటే.. ఐశ్వర్య కుడి చేతికి కట్టుతో కనిపించారు. ఇటీవల ఐశ్వర్య చేతికి గాయమైనట్లు సమాచారం. అయితే ఏ కారణంతో ఆమెకు గాయమైందో తెలియదు. ఇదే విషయమై నెటిజన్లు ఆమెకు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. కానీ చేతి కట్టుతోనే ఆమె క్యాట్వాక్లో పాల్గొన్నారు. చేతికి గాయంతో ఉన్న తల్లి ఐశ్వర్యకు కూతురు ఆరాధ్య తోడుగా ఉండడం కనిపించింది. కియారా అద్వానీ, సోభితా దూళిపాళ, ఆదితి రావు హైదరీతో పాటు ఇతర బాలీవుడ్ నటీనటులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు.