ఐదుగురు ఎంపీలతో ఢిల్లీకి వెళ్లి కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్: వినోద్ కుమార్
- కరీంనగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వినోద్ కుమార్
- కాంగ్రెస్, బీజేపీ మినహా ఇతర పార్టీలు ఉండకూడదని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయని విమర్శ
- తెలంగాణ సమస్యలపై ఢిల్లీలో పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్న బీఆర్ఎస్ అభ్యర్థి
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీ మినహా ఇతర పార్టీలు ఉండకూడదని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలు అవుతోందని.. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదన్నారు. తెలంగాణ సమస్యలపై ఢిల్లీలో పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.