వైసీపీ గెలిచే అవకాశం లేదన్న ప్రశాంత్ కిశోర్ పై బొత్స ఫైర్
- ప్యాకేజ్ తీసుకుని ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతున్నారన్న బొత్స
- లీడర్ కు, ప్రొవైడర్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శ
- పీకే ఏది మాట్లాడినా ఎల్లో మీడియా ఫ్రంట్ పేజ్ లో వేస్తోందని మండిపాటు
ప్రశాంత్ కిశోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని బొత్స అన్నారు. లీడర్ కు, ప్రొవైడర్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ లీడర్ అయితే, చంద్రబాబు ప్రొవైడర్ అని అన్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ తీసుకుని పీకే మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ నాయకత్వంలో గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో ముందడుగు వేసిందని చెప్పారు. గతంలో ఏపీలో 16, 15 స్థానాల్లో ఉండేదని... ఇప్పుడు 4, 5 స్థానాల్లో ఉంటోందని తెలిపారు. జగన్ అమలు చేసిన సంస్కరణలతోనే ఇదంతా సాధ్యమయిందని చెప్పారు.
పీకే ఏది మాట్లాడినా ఎల్లో మీడియా మొదటి పేజీలో వేసేస్తోందని బొత్స మండిపడ్డారు. ప్రశాంత్ కిశోర్ ప్యాకేజీ తీసుకుని పని చేస్తారని... ప్యాకేజీ ఇచ్చిన వాళ్లను ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతారని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పాలనను జగన్ అందిస్తున్నారనే విషయాన్ని పీకే గుర్తించాలని చెప్పారు. ఏ ఉద్దేశంలో ఈసీకి ఐపీఎస్ లపై ఫిర్యాదు చేశారని ప్రతిపక్ష కూటమిపై మండిపడ్డారు. ఐపీఎస్ లకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని అన్నారు.