కాంగ్రెస్ నన్ను ఆహ్వానించింది... సాయంత్రం అన్ని వివరాలు వెల్లడిస్తా: కడియం శ్రీహరి
- బంజారాహిల్స్‌లో కార్యకర్తలు, అనుచరులతో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే భేటీ
- అనుచరులు, కార్యకర్తలతో పార్టీ మార్పు అంశంపై చర్చించినట్లు వెల్లడి
- తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు వెంటే ఉంటానని చెప్పారన్న కడియం శ్రీహరి
- కార్యకర్తల రాజకీయ భవిష్యత్తు కోసం తన నిర్ణయం ఉంటుందని వెల్లడి
తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు తన వెంటే ఉంటానని చెప్పారని వెల్లడించారు. తనతో వచ్చే ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన అనుచరుల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన నిర్ణయం ఉంటుందని తెలిపారు. అందరితో మాట్లాడిన తర్వాత సాయంత్రం వివరాలు వెల్లడిస్తానన్నారు.