'ఆపరేషన్ వాలెంటైన్' నుంచి సాంగ్ రిలీజ్!
- వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'ఆపరేషన్ వాలెంటైన్'
- ఆయన సరసన సందడి చేయనున్న మానుషి చిల్లర్
- సంగీతాన్ని అందించిన మిక్కీ జె. మేయర్
- మార్చి 1వ తేదీన సినిమా విడుదల
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'గగనాల తేలేను నీ ప్రేమలోన .. ఎగిరాను ఎన్నేసి జన్మాలైనా .. తెగిపోయే బంధాలు లోకాలతోనా .. నువ్వేదురైన ఆనాటి తొలి చూపులోనా' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. హీరోయిన్ పై ఈ పాటను చిత్రీకరించారు.
మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఈ సినిమాలో వరుణ్ వాయుసేన అధికారిగా కనిపించనున్నాడు. నవదీప్ .. మహ్మద్ మీరు సర్వర్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు ఈ సినిమాను హిందీలోను విడుదల చేస్తుండటం విశేషం.