ఎన్నికల్లో పోటీ చేయాలని మూడు రాజకీయ పార్టీలు నన్ను ఒత్తిడి చేస్తున్నాయి: ప్రకాశ్ రాజ్
- కోజికోడ్ లో కేరళ సాహితీ ఉత్సవం
- హాజరైన నటుడు ప్రకాశ్ రాజ్
- పార్టీల ఒత్తిడి భరించలేక ఫోన్ స్విచాఫ్ చేసుకున్నానని వెల్లడి
"రాజకీయ పార్టీలకు అభ్యర్థులు ఎందుకు దొరకడంలేదు? మోదీపై వ్యతిరేకత తప్ప వాళ్లకంటూ సొంత అజెండా ఉండడంలేదు. వాళ్లు ప్రజల కోసం రావడంలేదు. అందుకే వాళ్లకు అభ్యర్థులు దొరకడంలేదు. ఇవాళ అభ్యర్థుల కోసం వెదుక్కునే దుర్భర పరిస్థితి వచ్చిందా? నేను ప్రధాని మోదీని విమర్శిస్తున్నందునే ఆ పార్టీలు నా వెంట పడుతున్నాయి. అంతే తప్ప వాళ్లు నా సిద్ధాంతాలను చూడడంలేదు" అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.