అప్పులు తీర్చడం కోసం పొలం అమ్మేశాం: హైపర్ ఆది
- 'జబర్దస్త్'తో పాప్యులర్ అయిన ఆది
- ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ
- తండ్రి చేసిన అప్పు గురించిన ప్రస్తావన
- మాట పడటం ఇష్టం ఉండదని వెల్లడి
"కాలేజ్ రోజుల్లో నేను మిమిక్రీ చేసేవాడిని .. అలాగే ఇమిటేట్ చేసేవాడిని. పంచ్ లు వేయడం కూడా అప్పటి నుంచే ఉంది. ఇక నటన విషయానికి వస్తే, మా నాన్న నాటకాలు వేసేవాడు. ఆయనను చూస్తూ పెరగడం వలన, ఆయన నుంచి నటన అనేది వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను" అని అన్నాడు.
" మేము ముగ్గురం అన్నదమ్ములం .. మా చదువుల కోసం మా నాన్న 20 లక్షల వరకూ అప్పుచేశాడు. నేను జాబ్ చేయడం వలన వచ్చిన డబ్బు, వడ్డీలు కట్టడానికి సరిపోయేది. ఇలా ఎంతకాలం అనిపించింది .. మాట పడటం ఇష్టం లేక, మాకున్న 3 ఎకరాలు అమ్మేశాము. కాకపోతే ఈ విషయంలో మా అమ్మానాన్నలను ఒప్పించడం కొంచెం కష్టమైంది అంతే" అని చెప్పాడు.