నయనతార క్రైమ్ థ్రిల్లర్ 'ఇరైవన్' (గాడ్) నెట్ ఫ్లిక్స్ లో!
- తమిళంలో సెప్టెంబర్ 28న వచ్చిన 'ఇరైవన్'
- సీరియల్ కిల్లర్ కీ .. పోలీస్ ఆఫీసర్ కి మధ్య నడిచే కథ
- తెలుగు ప్రేక్షకుల ముందుకు 'గాడ్' గా వచ్చిన సినిమా
- ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్
తమిళంలో బాగానే ఆడిన ఈ సినిమా, 'గాడ్' టైటిల్ తో తెలుగులో ఈ నెల 13వ తేదీన విడుదలైంది. అయితే తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ఆశించిన స్థాయి ఆదరణను పొందలేకపోయింది. దర్శకుడు అహ్మద్ ట్రీట్మెంట్ .. స్లో నేరేషన్ కారణంగా ఈ కంటెంట్ కనెక్ట్ కాలేదనే టాక్ వినిపించింది.
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమాను ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. నయనతార సినిమాలకి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందనేది చూడాలి.