నా గురువు అమితాబ్ నటించిన 'గణపథ్' టీజర్ షేర్ చేయడం సంతోషంగా ఉంది: చిరంజీవి
- టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రల్లో గణపథ్
- వికాస్ బెహల్ దర్శకత్వంలో హైఓల్టేజ్ చిత్రం
- అక్టోబరు 20న విడుదల
- చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
కాగా, గణపథ్ తెలుగు వెర్షన్ టీజర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ప్రియాతి ప్రియమైన టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అన్నింటికి మించి నా గురువు అమితాబ్ బచ్చన్ నటించిన గణపథ్ చిత్రం టీజర్ పంచుకోవడం సంతోషం కలిగిస్తోంది. ఈ చిత్రం విజయం సాధించాలంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను" అంటూ చిరంజీవి ఎక్స్ లో స్పందించారు.