కరీనా కపూర్ ఫస్టు వెబ్ సిరీస్ గా 'జానే జాన్' .. నెట్ ఫ్లిక్స్ కి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్!
- వెబ్ సిరీస్ ల దిశగా కరీనా కపూర్
- ఆమె ఫస్టు సిరీస్ గా 'జానే జాన్'
- ముఖ్య పాత్రల్లో విజయ్ వర్మ - జైదీప్ అహ్లావత్
- ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి, సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించాడు. కరీనా కపూర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ లో, విజయ్ వర్మ - జైదీప్ అహ్లావత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఒంటరి జీవితాన్ని గడిపే ఒక స్త్రీ ... ఒక పోలీస్ ఆఫీసర్ .. ఒక ఉపాధ్యాయుడు చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
మాయ అనే ఒక స్త్రీ కొన్ని కారణాల వలన తన భర్తను హత్య చేస్తుంది. ఆ రహస్యాన్ని దాచిపెట్టడానికి ఆమె అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా? అనే ఆసక్తికరమైన అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.