చంద్రముఖి 2: కంగనా రనౌత్‌ను ప్రశంసించిన నాటి చంద్రముఖి జ్యోతిక
- చంద్రముఖి 2లో నటించిన కంగనా రనౌత్
- సెప్టెంబర్ 15న విడుదల కానున్న సినిమా
- కంగనపై ప్రశంసలు కురిపించిన జ్యోతిక
ఈ సందర్భంగా చంద్రముఖి-2 బృందానికి జ్యోతిక శుభాకాంక్షలు తెలుపుతూ, కంగనను ప్రశంసించారు. కంగనా గొప్ప నటి అని, ఆమె ఈ పాత్రను పోషించడం గర్వంగా ఉందన్నారు. చంద్రముఖి లుక్‌లో ఆమె అద్భుతంగా ఉన్నారని, ఆమె నటనకు తాను అభిమానిని అని చెప్పారు. ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, రాఘవ లారెన్స్ మాస్టర్, పీ వాసు సర్ ఆల్ ది బెస్ట్.. మీకు విజయం దక్కాలని కోరుకుంటున్నానని పోస్ట్‌లో పేర్కొన్నారు.