వరుణ్ తేజ్ న్యూ మూవీ టైటిల్ ఖరారు .. రిలీజ్ డేట్ ఇదే!
- సోనీ పిక్చర్స్ నిర్మాణంలో 'ఆపరేషన్ వాలెంటైన్'
- వైమానిక దాడుల నేపథ్యంలో సాగే కథ
- వరుణ్ తేజ్ జోడీ కడుతున్న మానుషి చిల్లార్
- దర్శకత్వం వహిస్తున్న శక్తిప్రతాప్ సింగ్
- డిసెంబర్ 8వ తేదీన సినిమా విడుదల
సోనీ పిక్చర్స్ బ్యానర్లో వరుణ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఆపరేషన్ వాలెంటైన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వైమానిక దాడుల నేపథ్యంలో .. భారీ యాక్షన్ దృశ్యాలతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
కెరియర్ పరంగా వరుణ్ తేజ్ కి ఇది 13వ సినిమా. ఇందులో ఆయన IAF ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా 'రాడార్' ఆఫీసర్ పాత్రలో 'మానుషి చిల్లార్' అలరించనుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా కూడా ఈ పోస్టర్ ద్వారానే తెలియజేశారు.